ఎమ్మెల్యే నివాసంలో ఆదివాసుల దీపావళి సందడి
బోథ్: దీపావళి పండుగను పురస్కరించుకుని తలమడుగు మండలంలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు చేసిన నృత్యాలతో ఎమ్మెల్యే నివాసం పండుగ శోభను సంతరించుకుంది. వారి ఉత్సాహం, సందడితో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది