🔥 TRENDING Storm 'Murasu' Expected to Miss Rajast... Electric Shock Claims Life of 44-Year-... RJD MP Sudhakar Singh to Reveal Major... Body in sack found near refrigerator c... Man steals ₹23 lakh car from showroom... Fugitive caretaker Varun Kumar arreste...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో కూటమి నేతల జోరుగా ఎన్నికల ప్రచారం నాలుగు పంచాయతీల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను కలిసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు

✍️ Reporter: Reporter RAJU 🗓 03 Nov 2026, 08:17 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు సోమవారం సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా రింతాడ, లకవరపుపేట, శంకడా, జీకే వీధి పంచాయతీల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కలి మహేష్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొర్ర బలరాం, జీకే వీధి మండల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గుంట బుజ్జిబాబుతో పాటు ఆయా పంచాయతీలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App