🔥 TRENDING Mid‑day Meal Workers in Himachal Prade... Record Bid Received for Operating Wild... Six Killed in Uttarakhand Helicopter C... Delhi’s AQI spikes from 78 to over 200... ਜਲੰਧਰ ਪੁਲਸ ਸਖ਼ਤ! CP ਸਤਿੰਦਰ ਸਿੰਘ ਨੇ ਸੰਵ... AAP Announces First List of 40 Candida...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేకుండా వర్షం, రోడ్లన్నీ జలమయం

✍️ Reporter: T Kranthi Kumar 🗓 31 Oct 2026, 10:29 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌ లో నిన్న సాయంత్రం (శుక్రవారం 30 October 2026) ఉరుములతో కూడిన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా సుమారు మూడు నుంచి నాలుగు గంటలు కురిసింది. ఎల్ నినో ప్రభావం వల్ల చాలా రోజుల నుంచి తీవ్ర ఎండ, ఉక్కపోత లతో బాధపడుతున్న నగరవాసులు ఎట్టకేలకు ఉపశమనం పొందారు. సాయంత్రం సుమారు 5:30 గంటలకు ప్రారంభమైన ఈ భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ వర్షం కారణంగా ఐటీ కారిడార్ లు, ప్రధాన నివాస ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఏరియాల వారీగా నమోదైన వర్షపాతం: అత్యధికంగా బహదూర్పురా లో 82.3 మీ.మి వర్షపాతం నమోదు కాగా అత్యల్పం గా బోడుప్పల్ లో 7.5 మీ.మి ల వర్షపాతం నమోదైంది. నగరంలోని రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, నాంపల్లి, మలక్పేట్ మరియు అబిడ్స్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ (X) ద్వారా ఎప్పటికప్పుడు నీరు నిలిచిన రోడ్ల వివరాలు రూట్ అప్డేట్స్ ను వీడియో ల రూపం లో షేర్ చేస్తూ వాహనదారుల ను అప్రమత్తం చేశారు.
📲Get App