గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసిన ఎంపీటీసీ అభ్యర్థి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతదా పంచాయతీ సెగ్మెంట్-2లో ఎంపీటీసీ అభ్యర్థి సాగిన భీమేష్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఆయన గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ తనకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.