🔥 ट्रेंडिंग 48 अमृत विश्वविद्यालय के शोधकर्ता विश्... नागालैंड ने 28 अक्टूबर के लिए Dear Spa... प्रधानमंत्री मोदी ने भारत को भविष्य की... नागा समूहों ने कुकि विद्रोहियों के खिल... एनसीएसटी ने कांगपोक्पी अधिकारियों को स... मेघालय पुलिस के अधिकारी टावांग मैराथन...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మున్సిపాలిటీ ఎన్నికలలో టిడిపి నేత దేవినేని అవినాష్ విస్తృత ప్రచారం

✍️ रिपोर्टर: Kande Linga Prasad 🗓 28 अक्टू. 2026, 12:46 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా టిడిపి నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 27,28 వార్డుల అభ్యర్థులు, పూల వెంకటేశులు చింతపండు వెంకట కార్తీక్ జోరుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాసుల వీధిలో వ్యాపార సముదాయాలను పలకరించి ఎన్నికలలో టిడిపి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్య ఉందని విన్నవించగా వెంటనే బోరువేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడతామని పరిశుభ్రతకు ప్రాధాన్యత నిచ్చి వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టిడిపి నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ కళ్యాణ్ దుర్గం లో ఇప్పటికే 179 కోట్ల వ్యయంతో ఇంటింటికి కొళాయి పథకాన్ని అమలు చేసేందుకు నిర్మాణాలను వేగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్లను విస్తరించి డివైడర్లను ఏర్పాటు చేసి డివైడర్లలో ఆక్సిజన్ వెదజల్లే ప్రత్యేక చెట్లను నాటామని ప్రత్యేకమైన విద్యుత్ దీపాలతో పిలుగోలు తీసుకువచ్చినట్లు తెలిపారు. నగరవణాన్ని ప్రారంభించి పిల్లలకు వృద్ధులకు మంచి గాలిని పిలుచుకునే ఏర్పాటు చేసినట్లు తెలిపారు . కళ్యాణదుర్గం ముంచిపాలిటీని మరింత అభివృద్ధి చేయడానికి మున్సిపల్ ఎన్నికలలో టిడిపి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పణి, కునే సాయినాథ్, శివ ప్రసాద్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ లింగప్రసాద్ (వార్త), టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
📲Get App