ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ భూసేకరణపై చర్యలు: అదనపు కలెక్టర్
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణ ప్రక్రియలో భాగంగా భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణపై ఖానాపూర్ శివారులోని భూ నిర్వాసితులతో గ్రామ సభ నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. భూసేకరణ, పరిహారం తదితర అంశాల గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు.