కళ్యాణదుర్గం మునిసిపల్ ఎన్నికల లో కూటమి అభ్యర్థుల రోడ్ షో
కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు యశ్వంత్ చౌదరి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. స్థానిక సాయిబాబా మందిరములో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. వ్యాపార సముదాయాల యజమానులను కలుసుకొని టిడిపి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు,ఎస్ ఆర్ సి ప్రతినిధి అవినాష్ చౌదరి గోపి పాల్గొన్నారు.