🔥 ट्रेंडिंग ભુજના ભીરંડીયારમાં 669 કિલો શંકાસ્પદ પ... त्रिपुरा वैज्ञानिक ने अफ्रीकी चावल उत्... उत्तरी त्रिपुरा में ड्राइवर की रहस्यमय... गुजरात में राष्ट्रीय एकता दिवस पर त्रि... हिमाचल प्रदेश में अब वेट भुगतान होगा इ... हिमाचल में पैराग्लाइडिंग दुर्घटना में...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

సింగరేణి భూపాలపల్లి ఏరియాలో అవినీతి నిర్మూలన విజిలెన్స్ వారోత్సవం నిర్వహణ

✍️ रिपोर्टर: Burra Kirankumara 🗓 26 अक्टू. 2026, 05:25 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

సింగరేణి కోల్లియర్స్ కంపెనీ భూపాలపల్లి ఏరియాలో 26 అక్టోబర్ 2026 న అవినీతి రహిత సమాజ నిర్మాణానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహించింది.

26 అక్టోబర్ 2026 సోమవారం, సింగరేణి కోల్లియర్స్ కంపెనీ భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో అవినీతి రహిత సమాజ నిర్మాణానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఏరియా ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ శ్రీ డి. శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులతో అవినీతి నిర్మూలన, నిజాయితీ, నైతిక విలువలకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) జోతి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ టి. పోషమల్లు, AITUC నాయకులు మోటపలుకుల రమేశ్, INTUC నాయకులు బి.మధుకర్ రెడ్డి, భూపాలపల్లి సి‌ఎం‌ఓ‌ఐ‌ఏ అద్యక్షులు నజీర్, ఐటిచ సీనియర్ ప్రోగ్రామర్ శంకర్ వంటి వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జీఎం శ్రీ డి. శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, అవినీతి రహిత పరిపాలన సంస్థ అభివృద్ధికి, ప్రజల విశ్వాసం పెంపొందించడానికి కీలకమని, ప్రతి ఉద్యోగి తన విధులను నిజాయితీతో, బాధ్యతతో నిర్వహించాలని, నిబంధనలను పాటించాలని సూచించారు.

విజిలెన్స్ అవగాహన అనేది ఒక వారానికే పరిమితం కాకుండా, ప్రతి ఉద్యోగి నిత్య జీవితంలో భాగంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సంస్థ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అందువల్ల అవినీతి రహిత కార్యాలయ వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
📲Get App