మహబూబా జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని పెద్ద చెరువు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు.
Watch on:
📘 Facebook
మహబూబా జిల్లా
తొర్రూరు మున్సిపాలిటీలోని పెద్ద చెరువు వద్ద
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన సంస్కృతికి గర్వకారణమని, ఇలాంటి పండుగలు మన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.