🔥 ट्रेंडिंग જ્ઞાનોદય શિશુ મંદિરમાં નવરાત્રી મહોત્સ... राष्ट्रीय स्वयंसेवक संघ नरपतगंज द्वारा... जमशेदपुर में धूमधाम से निकली शुभ सप्तम... सोनीपत के राई गांव में धूमधाम से मनाया... नगीना में नगर पालिका की पाइपलाइन लीक,... 20 ਅਕਤੂਬਰ ਤੋਂ ਸਸਤੇ ਹੋ ਜਾਣਗੇ NZ ਦੇ ਸ਼ਰਾ...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు
स्थानीय

సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు

✍️ रिपोर्टर: Burra Kirankumara 🗓 17 अक्टू. 2026, 05:21 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. బతుకమ్మ విసర్జన కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, విశిష్ట జీవన విధానానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఆడపడుచులు అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడుకోవాలని, ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు.

అలాగే చెరువులు, ఘాట్ల వద్ద బతుకమ్మ విసర్జన కార్యక్రమాలు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
📲Get App