🔥 TRENDING मोहम्मदाबाद गोहना में तमसा नदी के पुल... Debipokkho বেহালা নূতন দলের পুজো এক্সক... Key suspect in ₹3.4‑crore investment s... IMD warns of thunderstorms across Kera... Andhra Pradesh Tourism Projects Worth... MUD​A Surveys Sites for New Cricket St...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

తణుకులో ప్రజాసంఘాల నిరసన: ఢిల్లీలో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని డిమాండ్

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 11 Oct 2026, 08:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ తణుకులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ తణుకులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపాన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనకు సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి మురళీకుమార్ ఆధ్వర్యం వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే వారిపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని నిరసనకారులు విమర్శించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి సూచించారు.
📲Get App