🔥 TRENDING फतेहपुर: नवरात्र में मां भवानी मंदिर क... आमलिया ग्राम पंचायत: वार्ड 4 से सोनारा... वाराणसी में 11 से 26 अक्टूबर तक बंद रह... IMF અને વિશ્વ બેંકના અહેવાલો: ભારત ૨૦૨... Police seize drugs, foreign cigarettes... Goa and Mizoram Swap Youth Delegations...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

బతుకమ్మ పండుగ వేడుకలు

✍️ Reporter: Thalapally Kranti Kumar 🗓 11 Oct 2026, 12:15 AM 👁 22
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబురాలు.
"బతుకమ్మ"అంటే అర్థం జీవించు తల్లి లేదా మాతృదేవత సజీవంగా వచ్చిందని.
బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక నిలువెత్తు రూపం. ఈ పండుగ రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మని పేర్చి ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచులకు ఒక ఎమోషన్. ఈ పూల పండుగ బతుకమ్మని తెలంగాణ అంతటా మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల వారు కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమై 9 రోజుల పాటు సాగి అశ్వయుజ అష్టమి, (దుర్గాష్టమి నాడు) సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
9 రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ పండుగలో ప్రతిరోజు ఒక విలక్షణమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

9 రోజుల సంబురాలలో
మొదట ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమై
క్రమంగా అటుకుల బతుకమ్మ
,ముద్దపప్పు బతుకమ్మ
,నానబియ్యం బతుకమ్మ
,అట్ల బతుకమ్మ
,అలిగిన బతుకమ్మ
,వేపకాయల బతుకమ్మ
,వెన్నముద్ద బతుకమ్మ
చివరగా సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది.

బతుకమ్మ పండుగ వెనుక అనేక పౌరాణిక, జానపద మరియు చారిత్రక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఒక్క కథ స్త్రీ శక్తిని, ప్రకృతిని మరియు తెలంగాణలో నివసించే ప్రజల జీవన విధానాన్ని ఆరాధించేలా ఉంటాయి.

బతుకమ్మ పండుగ అనేది స్త్రీల గొప్పతనాన్ని, వీరత్వాన్ని మరియు ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించే చెబుతుంది.
📲Get App