🔥 TRENDING NMC Announces 3,656 MS Orthopaedics Se... MP Tai Tagak Highlights Court Cases Ha... Arunachal Pradesh Protest Over 11,200-... Man Killed in Hit‑and‑Run in Samba, Ja... ବୁଢ଼ାବଳଙ୍ଗ ନଦୀର ବାଲିରୁ ମିଳୁଛି ସୁନା! Audit Finds 20% of MGNREGA Job Cards U...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొత్త రేషన్ కార్డు పంపిణీ శ్రీకారం

✍️ Reporter: R4TV News 🗓 08 Oct 2026, 11:44 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

మునీరాబాద్ లో కొత్త రేషన్ కార్డు పంపిణీ

సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని *మునీరాబాద్* లో పౌర సరఫరాల శాఖ అధికారి లక్ష్మీకాంత్ గారు, స్థానిక రేషన్ డీలర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమక్షంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *299 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్,* హాజరై, జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి ముదిరాజ్, మునిరాబాద్ మాజీ ఉపసర్పంచ్ సుక్క బిక్షపతి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరాం రెడ్డి గారు, తలారి వెంకటేష్ ముదిరాజ్, కర్రోల్ల సంతోష్ కుమార్ , కర్రోళ్ల ప్రవీణ్ కుమార్ ,నాగరాజు రెడ్డి , రామకృష్ణారెడ్డి , గుండ్ల పోచంపల్లి డివిజన్ మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్, రామారం రాజశేఖర్, నక్క నగేష్ గౌడ్, ఎండి జాంగిర్ , రామారం నర్సింగరావు ,యూత్ కాంగ్రెస్ నాయకులు తేలు నరేష్ ముదిరాజ్ గారు, లతో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా గరిసెల *సురేందర్ ముదిరాజ్ గారు* మాట్లాడుతూ మాట్లాడుతూ "సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజా పాలన అద్భుతంగా కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూసిన పేదలకు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి కార్డులు అందిస్తుంది. మునీరాబాద్, లో అర్హులైన ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ కార్డులు ఇప్పిస్తాం" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
📲Get App