ఆదిలాబాద్ లో రేపు పవర్ కట్
విద్యుత్ మరమ్మతుల కారణంగా ఈ నెల 7న ఆదిలాబాద్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ శాఖ అధికారి కిరణ్ తెలిపారు. 33కేవీ కైలాస్నగర్ ఫీడర్ నిర్వహణ పనుల నేపథ్యంలో కైలాస్నగర్, శాంతినగర్, ఓల్డ్ హౌసింగ్బోర్డ్, ఆర్ఆర్నగర్, గణేశ్ నగర్, కమ్మరివాడ, దస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంట వరకు అంతరాయం ఉంటుందన్నారు.