ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు: ఆదిలాబాద్ డీఎస్పీ
LBSనగర్లో ప్లాట్ కొనుగోలు పేరుతో మోసం చేసి, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి, బ్యాంకు రుణం పొందినట్లు ఫిర్యాదు రావడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు DSP జీవన్రెడ్డి తెలిపారు. బాధితుడు మడవి గోపాల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. బాధితుడిని కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో నిందితులు లక్ష్మణ్, క్రాంతి, నరేశ్లపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.