గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందాలి: ఆనంద్
ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం పొందే హక్కును చట్టబద్ధం చేశారని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఒరగంటి ఆనంద్ తెలిపారు. ఆహారంతో పాటు గర్భిణులకు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రసవ సమయంలో శిశు మరణాలను అరికట్టేందుకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. పోషకాహారంతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు.