చిన్ననాటి నుంచే క్రీడలపై దృష్టి పెట్టాలి: డీవైఎస్వో
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం జూడో హాల్లో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికలకు జిల్లాస్థాయి యోగా ఎంపిక పోటీలు నిర్వహించారు. డీవైఎస్వో దయానంద్ రెడ్డి, డీటీఏస్వో పార్థసారథి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే క్రీడలపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగవచ్చన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని సూచించారు.