ఇచ్చోడ: గ్రామసభ ద్వారా ఉపాధి పనులు ఎంపిక
ఇచ్చోడ మండలం కామగిరిలో రానున్న 3 సంవత్సరాలకు చేపట్టబోయే ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేశారు. పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ రిసోర్స్ మ్యాప్ వేసి ఇదివరకు ఉపాధిలో చేసిన పనులు చూపిస్తూ.. రానున్న రోజుల్లో చేపట్టనున్న పనులను గ్రామస్తులు సమక్షంలో ఎంపిక చేశారు. ఏపీవో నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకంలో చేపట్టనున్న పనులకు గ్రామసభ ద్వారా ఆమోదం తీసుకుంటున్నట్లు తెలిపారు.