అదిలాబాద్ :పోలీసులపై దాడి కేసులో ముగ్గురికి జైలు శిక్ష
గంజాయి తనిఖీలను అడ్డుకొని విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసిన కేసులో ముగ్గురికి శిక్ష పడింది. భీంపూర్ పీఎస్లో నమోదైన కేసులో మంచికంటి ఓంకార్ (26), ఆత్రం సోనేరావు (34), టేకం దత్తు (50)కు జిల్లా జడ్జి ప్రభాకర్రావు ఒక్కొక్కరికి ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.