🔥 TRENDING Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ముగ్గురు ఉన్నారు మృతి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 12:28 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం మూడు పసికందుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (SNCU)లో సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఏసీకి సంబంధించిన సమస్యతో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వార్డంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
ఆ సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న పసికందులను రక్షించేందుకు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పలువురు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, ఈ ఘటనలో మూడు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఈ విషాదంతో బాధిత కుటుంబాల రోదనలు రిమ్స్ ప్రాంగణాన్ని కలచివేశాయి.
పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రుల ఒడిలోకి చేరాల్సిన పసికందులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ పరికరాల నిర్వహణ, అగ్నిమాపక భద్రతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఎందుకు జరగలేదనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఒక చిన్న నిర్లక్ష్యం... మూడు కుటుంబాల్లో జీవితాంతం చెరిగిపోని విషాదం.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఘటనపై అధికారిక దర్యాప్తు, భద్రతా చర్యలపై సమీక్షకు ఆదేశాలు ఇచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
📲Get App