🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 03:04 PM 👁 82
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని రిమ్స్ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రిమ్స్ ప్రధాన ద్వారం, అత్యవసర విభాగం, ఆస్పత్రి ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రిమ్స్‌కు వచ్చే సందర్శకులు, ప్రజలు, వాహనాల రాకపోకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో రిమ్స్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
📲Get App