దళితుల సమస్యలు పరిష్కరించాలి.. డీహెచ్‌పీఎస్ డిమాండ్!
Watch on:
▶️ YouTube
దళిత హక్కుల సంఘం
వెంసూరు మండలం కందుకూరు: దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి వెంగళ ఆనందరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల సాయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత, అసైన్డ్ భూములకు హక్కులు, ఉపాధి అవకాశాలు, పోడు భూములకు పట్టాలు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం చేపట్టాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.