🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కుడుపూడి

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కుడుపూడి

✍️ Reporter: Palika srinivas 🗓 08 Sep 2026, 09:08 PM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

మహిళలకు కుట్టు మిషన్ల వల్ల స్వయం ఉపాధి కలుగుతుందని ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఇప్పుడు పూడి శివన్నారాయణ అన్నారు

కుటుంబానికి ఆసరాగా స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ల శిక్షణ దోహదం చేస్తుందని ముమ్మిడివరం ఎ ఎమ్ సి మాజీ ఛైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. ఆ లక్ష్యంతోనే తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతి పత్తిగొందిలో మూడు నెలలు పాటు శిక్షణ పొందిన 22 మంది మహిళలకు మంగళవారం ఆయన తన నివాసం వద్ద కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్బంగా శివన్నారాయణ మాట్లాడుతూ తనకు తోచిన రీతిలో పేదలకు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. గతంలో మహిళలకు 100 కుట్టు మిషన్లు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. గ్రామంలో కుట్టు మిషన్ల శిక్షణ తీసుకున్న మహిళలు మిషన్లు ఇవ్వాలని కోరడంతో రూ. 1.65 లక్షలతో 22 మిషన్లు గొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. అందులో కొంత మంది మహిళలు రూ. 60 వేలు సమకూర్చగా మిగిలిన లక్షా 5 వేలు తాను చెల్లించి నట్లు శివన్నారాయణ తెలిపారు. ఈ కుట్టు మిషన్లను ఉపయోగించుకుని వివిధ దుస్తులను తయారు చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని కోరారు. కోరిన వెంటనే కుట్టు మిషన్లను కొనుగోలు చేసి తమకు అందజేసిన శివన్నారాయణకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. తాము నేర్చుకున్న కుట్టు శిక్షణ వృధా కాకుండా కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందుతామని తెలిపారు. ఈ సందర్భంగా దాత శివన్నారాయణను మహిళలు ఘనంగా సత్కరించారు. ప్రముఖ న్యాయవాది యడ్ల కుటుంబరావు, యువ నాయకులు కుడుపూడి శ్రీనివాస్, దున్నా మురళి, దున్నా ఎల్లారావు, దంగేటి విజ్ఞేశ్వరరావు, ఒళ్ళు శ్రీనివాస్, గుత్తుల రాము, కొప్పల అబ్బులు, వుండ్రు కనకయ్య, కుంచె బీంజి, దున్నా శ్రీనుబాబు, గొల్లపల్లి పార్వతి, ఎలుపే సుమలత, దున్నా మణి, దున్నా లోవతల్లి, మానుకొండ స్వాతి, దున్న సుజాత, కొప్పుల అబ్బులు, విఘ్నేశ్వరరావు, పెద్దలు పాల్గొన్నారు.
📲Get App