ఆదిలాబాద్: NHM పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
यहाँ देखें:
📘 Facebook
NHM కింద జిల్లాలో ఖాళీగా ఉన్న 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DMHO డాక్టర్ సాధన తెలిపారు. తన పేరు చెప్పుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసే మోసపూరిత మాటలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో మెరిట్, రోస్టర్ విధానం ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.