రహదారి, లైటింగ్ పనులు వేగవంతం చేయాలి: MLA అనిల్ జాదవ్
ఇచ్చోడ మెయిన్ రోడ్ పెండింగ్ పనులతో పాటు డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని MLA అనిల్ జాదవ్ R&B అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను పరిశీలించిన ఆయన, రూ.13 కోట్లతో చేపట్టిన పనుల్లో 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సీసీ రోడ్లతో పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.