ADB: పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సత్కారం
41 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన ఎస్సై గండ్రత్ గంగాధర్, ఏఎస్సై కేశవస్వామిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువా, పూలమాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. పోలీసు శాఖకు అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.