శిశువుల కుటుంబాలకు నష్టపరిహారం 50 లక్షలు అందజేయాలని కవిత డిమాండ్ చేశారు.
Watch on:
▶️ YouTube
ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన షార్ట్‌సర్క్యూట్ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే జరిగిందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన శిశువుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
రిమ్స్‌లో నెలకొన్న ఆరోగ్య, మౌలిక వసతుల సమస్యలపై తమ పార్టీ తరఫున ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు. ఆసుపత్రిలోని పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.