సిరికొండ: పాము కాటుతో ఆవు మృతి.. రైతుకు రూ.40 వేల నష్టం!
సిరికొండ మండలం పాలవాగు గ్రామంలో పాము కాటుతో ఓ రైతుకు చెందిన ఆవు మృతి చెందింది. అటవీ సమీపంలో మేతకు వెళ్లిన ఆవు కనిపించకపోవడంతో పశువుల కాపరి గాలించగా మృతి చెంది కనిపించింది. శరీరంపై పాము కాటు గుర్తులు ఉండటంతో పాము కాటుతోనే చనిపోయినట్లు గుర్తించారు. ఆవు మృతితో రూ.40 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నారు.