🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: బీఆర్‌ఎస్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 01:50 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ప్రమాదంలో గాయపడిన శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, మృతి చెందిన ఒక్కో చిన్నారి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.
📲Get App