🔥 TRENDING Six dead as Old Delhi building collaps... Tripura Police Launch Joint Search Ope... Basement fire erupts in Delhi's Khidki... Himachal Pradesh Commission Initiates... शेंद्रा एमआयडीसीतील लेबर कॉन्ट्रॅक्टरच... Delhi's Diwali Day Air Quality Hits Ha...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

249 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఘన విజయం గుర్రాలుగొందిలో గెమ్మెలి పాల్సు గెలుపు.. దింసా నృత్యాలతో కార్యకర్తల సంబరాలు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 08 Nov 2026, 08:12 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడా 1 పంచాయతీ పరిధిలోని గుర్రాలుగొంది గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గెమ్మెలి పాల్సు విజయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థిపై 249 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.విజయం ఖరారు కావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సంప్రదాయ దింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలో విజయోత్సవాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గెమ్మెలిపాల్సు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
📲Get App