🔥 TRENDING लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश राम लीला સાબરકાંઠા: તલોદ પોલીસે ભરણપોષણ કેસમાં... Haryana Orders Early Pollution Control... Haryana’s 2005‑06 Ranji Trophy Stats P... Home Minister Shah praises aid for Nax...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ఇండియా మరియు విండీస్ మధ్య జరిగిన నాల్గవ టీ 20 లో విండీస్ ఘన విజయం

✍️ Reporter: Thalapally Kranti Kumar 🗓 16 Oct 2026, 12:19 AM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అక్టోబర్ 14, 2026 బుధవారం నాడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన నాల్గవ టీ -20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు 24 పరుగుల తేడాతో ఇండియా పై విజయం సాధించింది.
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతము 2-2-తో సమమైంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు లు మాత్రమే కోల్పోయి 240 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. విండీస్ జట్టు లో కెప్టెన్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి అజయంగా నిలవగా రూథర్ఫోర్డ్ 49 పరుగులు చేశారు.
భారీ లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్ జట్టు మొదట దూకుడుగా ఆడింది, ఈ క్రమంలో సంజూ శాంసన్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా తిలక్ వర్మ 43 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు తెలుగు తేజాలు కలిసి 72 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పోరాటం పటిమ చూపిన భారత్ పరాజయం పాలైంది.
విండీస్ ఫాస్ట్ బౌలర్ కీమో పాల్ 41 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి భారత లైనప్ ని దెబ్బతీసి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నాడు. సిరీస్ 2-2తో సమం కాగా అక్టోబర్ 17 శనివారం రోజు చివరి T20 మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
📲Get App