🔥 TRENDING Heavy Rains Expected to Batter Chennai... Renowned Chef Damu Passes Away Wightwick Manor Honors Cooch Behar Pri... CPI(M) Book Stalls See Sales Surge in... West Bengal CM Prepares for First Gang... Tragic Trailer Collision Claims Two Li...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గజ్వేల్‌లోని వాసవి నగర్ 2వ వార్డు లో  పారిశుద్ధ్యం పడకేసింది! వాసవి నగర్ రెండవ వార్డు లో  పేరుకుపోయిన చెత్త.. ప్రజల సహనానికి పరీక్ష! ఫొటోలకు ఫోజులేనా? ప్రజా సమస్యలు పట్టవా? కౌన్సిలర్‌, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!

✍️ Reporter: Thanuj Prasad 🗓 25 Oct 2026, 12:48 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

పేరుకుపోయిన చెత్త

గజ్వేల్ పట్టణంలోని 2 వ వార్డు వాసవీనగర్  దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వార్డులో పేరుకుపోతున్న చెత్తాచెదారం, పారిశుద్ధ్య సమస్యలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
చెత్త కుప్పల మధ్యే ప్రజల జీవనం!
2 వ వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? వార్డు పరిస్థితులను కౌన్సిలర్‌, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసన, దోమల బెడద పెరిగితే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఫొటోలకు ఫోజులా.. ప్రజలకు సేవలా?
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు  కేవలం ఫోటో పోజులకే పరిమితమైతే ఎలా? 2 వ వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులు ఇంత దయనీయంగా ఉంటే బాధ్యత ఎవరిది? ప్రజల సమస్యలు కనిపించడం లేదా? కనిపించినా పట్టించుకోవడం లేదా? అంటూ స్థానికులు నిలదీస్తున్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రతను కాపాడటం ప్రజాప్రతినిధులు, మున్సిపల్ యంత్రాంగం ప్రధాన బాధ్యత. అలాంటిది వాసవీనగర్ 2 వ వార్డులో లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా స్పందిస్తారా?
గజ్వేల్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వాసవీనగర్ 2 వ వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. వార్డులో సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకు కావాల్సింది ప్రచారం కాదు.. పరిష్కారం! ఫొటోలు కాదు.. పారిశుద్ధ్యం! హామీలు కాదు.. చేతల్లో కనిపించే పని!
గజ్వేల్ 2 వ వార్డు వాసవి నగర్  దుస్థితిపై కౌన్సిలర్‌, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు జవాబు చెబుతారా? లేక ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా మౌనం వహిస్తారా? అన్నది వేచి చూడాలి.
📲Get App