నికిత రాథోడ్‌కు రూ.16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పేద ప్రజలకు వైద్య చికిత్సలో అండగా ఉంటాం.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం అందిస్తాం
నెరడిగొండ: మండలంలోని బొరిగాం గ్రామానికి చెందిన నికిత రాథోడ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ.16,000 విలువైన చెక్కును ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని, అలాంటి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం ఆగిపోకూడదనే ఉద్దేశంతో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందిన వారు సంబంధిత వైద్య బిల్లులు, అవసరమైన పత్రాలను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అర్హత కలిగిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందుకున్న నికిత రాథోడ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, మాజీ సర్పంచ్ పవన్, నాయకులు సాబ్లే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.