🔥 TRENDING समस्तीपुर की मुफ्सिल थाना क्षेत्र के म... ଆସନ୍ତାକାଲିଠାରୁ ତିନି ଦିନ ଯାଏ ଶ୍ରୀମନ୍ଦିର... भोपाल के नाथु बरखेड़ा में अंतरराष्ट्री... ଆସନ୍ତା ଦୁଇ ଦିନ ନନ୍ଦନକାନନ ପ୍ରାଣୀ ଉଦ୍ୟାନ... ବାତ୍ୟା ‘ଅକଭାନ୍’ ପାଇଁ ହାଇଆଲର୍ଟରେ ଓଡ଼ିଶା... बादड़ीया से भानीपुरा वाली रोड की ख़राब...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

15 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థుల ఖరారు.. ఎన్నికల బరిలో కూటమి బలపరిచిన నేతలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన మండల అధ్యక్షుడు పొత్తురు కొండలరావు.. విజయమే లక్ష్యంగా శ్రేణులకు పిలుపు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 11:48 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో 15 పంచాయతీలకు కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల పేర్లను మండల పార్టీ అధ్యక్షుడు పొత్తురు కొండలరావు అధికారికంగా వెల్లడించారు.పంచాయతీల వారీగా అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. వంచుల నుంచి ముర్ల భూపతి, మొండిగెడ్డ నుంచి మచ్చల మత్స్య లింగమూర్తి, జర్రెల నుంచి బంగారు శిరీష, రింతడ నుంచి వాడేలా పాండురాజు, దేవరపల్లి నుంచి గడుతురి సాయికుమారి, పెదవలస నుంచి కంకిపాటి నారాయణమ్మ, లక్కవారపుపేట నుంచి గబులంగి రమణకుమారి, జీకే వీధి నుంచి కంకిపాటి నారాయణమ్మ, ఏ. దరకొండ నుంచి గుంట ఆనందరావు, గాలికొండ నుంచి కొర్ర నాగమ్మ, గుమ్మిరెవుల నుంచి మూర్ల నారాయణరావు, దారకొండ నుంచి శెట్టి సత్యవతి, దుప్పులవాడ నుంచి తిరుపతి మన్నదరావు, దమనపల్లి నుంచి కూడ పద్మ, సంకడ నుంచి దేసగిరి గోవిందరావు ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు.
మండలంలోని అన్ని పంచాయతీల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కొండలరావు సూచించారు. అభ్యర్థులకు పూర్తి సహకారం అందిస్తూ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
📲Get App