🔥 TRENDING Mumbai-Goa Highway 8‑km Stretch on Fir... નર્મદામાં ૭૨ કલાક રોકાશે નાયબ મુખ્યમંત... छठ महापर्व के अवसर पर बिलासपुर के अरपा... Special DG CRPF Says Jammu & Kashmir N... BJP Leader Accuses Rahul Gandhi of See... 24-Hour General Strike Called by Nativ...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

1008 మందికి చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ కాపీలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 16 Nov 2026, 12:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని షార్ప్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 1008 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, అర్హులైన పేదలకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
📲Get App