🔥 TRENDING ધારી-અમરેલી રોડ પરના ભયજનક વળાંકને દૂર... BreakingNews वृंदावन की हरे कृष्णा आर्... વડોદરા: વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષભાઈ... वाराणसी में ABVP की तिरंगा यात्रा: दिल... મહીસાગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અ... পদপিষ্ট। মৃ*ত্যু ১৭ জনের(হাসপাতাল সূত্...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 ఆయుష్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

✍️ Reporter: Burra Kirankumara 🗓 17 Oct 2026, 09:54 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

జాతీయ ఆయుష్ మిషన్ కింద జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్ర రావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద ప్రజారోగ్య కార్యక్రమం అమలులో భాగంగా మొత్తం 10 ఉద్యోగాలను పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్ర రావు తెలిపారు. ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయుష్ వైద్యాధికారులు (4 పోస్టులు, రూ.40,000 వేతనం), ఫార్మసిస్ట్ (1 పోస్టు, రూ.15,000), యోగా శిక్షకుడు (1 పోస్టు, రూ.28,000), బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు (3 పోస్టులు, రూ.15,000), సైకోసోషియల్ కౌన్సిలర్ (1 పోస్టు, ఒక్కో సందర్శనకు రూ.500) వంటి వివిధ కేటగిరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు 01.07.2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని తెలిపారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు నమూనాలో పూర్తి వివరాలు నమోదు చేసి, సంబంధిత విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటో తదితర అవసరమైన పత్రాలను జతచేసి దరఖాస్తు సమర్పించాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరిస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను స్వయంగా కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూము నంబర్ జి5, భూపాలపల్లి 506169 ఆయుష్ విభాగంలో సమర్పించవచ్చని, లేదా సంబంధిత చిరునామాకు చేరేలా పంపించాలని సూచించారు. అర్హతలు, ఇతర నియామక నిబంధనలు మరియు పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత నియామక ప్రకటనను https://bhoopalapally.telangana.gov.in వెబ్ సైట్ లో పరిశీలించాలని డాక్టర్ రాఘవేంద్రరావు సూచించారు.
📲Get App