🔥 ट्रेंडिंग સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસક... એશિયાડમાં પાકિસ્તાન સામે ક્રિકેટમાં જી... નવાગામ - સોમલપર માર્ગનું વિધિવત ખાતમુહ... વિકસિત ભારત @ 2047’, ‘નશા મુક્ત ભારત’... पूर्व गुजरात मंत्री चावड़ा ने बीजेपी स... कर्नाटक ने 2027 के एसएसएलसी परीक्षा शु...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*హుజూర్ నగర్ - 03 అక్టోబర్ 2026* *2 & 3 వార్డుల పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*

✍️ रिपोर्टर: THELLA GOPI 🗓 03 अक्टू. 2026, 04:11 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*హుజూర్ నగర్ - 03 అక్టోబర్ 2026*

*2 & 3 వార్డుల పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని *2వ మరియు 3వ వార్డుల* పరిధిలో ఈరోజు *32 నెంబర్ రేషన్ షాప్* కు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ *గౌ|| దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు*, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ *గౌ|| కోతి సంపత్ రెడ్డి గారు*, 2వ వార్డు కౌన్సిలర్ *గౌ|| కోడి ఉపేందర్ జ్యోతి గారు*, 3వ వార్డు కౌన్సిలర్ & 25వ వార్డు ఇన్చార్జి *గౌ|| సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ గారు* హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో *32 నెంబర్ రేషన్ డీలర్ ఉదారి సంధ్యారాణి యాదగిరి గారు* పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ...*
"రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో స్మార్ట్ కార్డుల పంపిణీ ద్వారా రేషన్ పంపిణీలో పారదర్శకత, వేగం పెరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు అందేలా చూస్తాం" అని అన్నారు.

*ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి గారు మాట్లాడుతూ...* "ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి వార్డులో స్మార్ట్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తున్నాం. ఎవరికైనా కార్డు రాకపోతే మున్సిపాలిటీని సంప్రదించాలి" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇట్లు
సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్
మూడో వార్డు కౌన్సిలర్ హుజూర్నగర్ మున్సిపాలిటీ
📲Get App